News November 22, 2024

‘కన్నప్ప’ నుంచి మోహన్ బాబు లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు నటిస్తోన్న ‘మహాదేవ శాస్త్రి’ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని విష్ణు ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Similar News

News December 3, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున కాసేపు వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో వైపు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. చలి తీవ్రత బాగా తగ్గింది.

News December 3, 2024

రాజ్యసభ ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

image

AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. TDP తరఫున బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి ఆర్.కృష్ణయ్య బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన ఒక సీటు ఆశించినా ఇప్పటికైతే ఆ ఛాన్స్ లేదని టాక్. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు Dy.CM పవన్ హస్తినలో చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.

News December 3, 2024

సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే?

image

ఒకప్పుడు థియేటర్‌లో ఫ్యాన్ సౌండ్ మోత భరిస్తూ సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి సెంట్రల్ ఏసీలు, ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో టికెట్ ధరలూ పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా టికెట్ రేట్ల పెంపునకు ఓ కారణం. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, భారీ సెట్లు, లొకేషన్లు, VFXల కారణంగా ధరలు అధికంగా పెరుగుతున్నాయి.