News September 30, 2024
‘కాంతార’ ప్రీక్వెల్‌లో మోహన్ లాల్?
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన ‘కాంతార’కు రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారలో హీరో తండ్రి పాత్రలో కూడా రిషబ్ కనిపించారు. ప్రీక్వెల్‌లో ఆయన కథ ఉంటుందని సమాచారం. ఆ పాత్రకు తండ్రి రోల్‌లో మోహన్‌లాల్ కనిపిస్తారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రీక్వెల్‌పై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
Similar News
News October 5, 2024
ఈసారి చలి తీవ్రత అధికం: IMD
దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తిరోగమనంలో నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉందని, దీనివల్ల ఈ నెలలో ‘లా నినా’ ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపింది. వాయవ్య, మధ్య భారతదేశంలో విపరీతమైన చలిగాలులు వీస్తాయంది. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3-5 డిగ్రీలు ఉండొచ్చు.
News October 5, 2024
రూ.150 కోసం ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి
AP: కృష్ణా(D) కంకిపాడు(M) ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రూ.150 నగదు విషయంలో స్నేహితులు భుజంగరావు, వెంకటస్వామి మధ్య గొడవ ఏర్పడింది. వెంకటస్వామి ఆగ్రహంతో భుజంగరావు గుండెపై గట్టిగా కొట్టారు. అతను గతేడాదే హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ NZB, SRCL, SDPT, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, VKB, SRD, MDK, NRPT, కామారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది.