News March 27, 2025
మోహన్‌లాల్ ‘L2 ఎంపురాన్’ పబ్లిక్ టాక్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రీమియర్ షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు సీక్వెల్‌పై ఇచ్చే సర్‌ప్రైజ్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్, ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News April 20, 2025
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన KCR

ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.
News April 20, 2025
భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం
News April 20, 2025
PHOTOS: స్టైలిష్ లుక్‌లో Jr.NTR

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కోసం Jr.NTR బయల్దేరినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేనితో ఆయన ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తారక్ కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈనెల 22 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. అయితే షూటింగ్ ఎక్కడ జరగనుంది? హీరో ఎక్కడికి బయల్దేరారనే విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించలేదు.