News April 9, 2024

మోమో షాప్ హెల్పర్ జీతం రూ.25వేలు!

image

ఉద్యోగానికి సిద్ధపడే ఫ్రెషర్లకు మంచి ప్యాకేజ్ గగనమైపోతున్న వేళ సోషల్ మీడియాలోని ఓ పోస్ట్ చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. మోమోలు తయారు చేసే షాప్‌లో హెల్పర్ ఉద్యోగానికి నెలకు రూ.25వేలు ఆఫర్ చేయడమే ఇందుకు కారణం. ఈ ఆఫర్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్లకు కార్పొరేట్ కంపెనీల ఆఫర్ కన్నా ఎంతో నయం అని పలువురు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆ షాప్ ఎక్కడుందనేది తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

కోలుకుంటున్న శరద్ పవార్‌

image

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

News February 9, 2026

‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

image

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News February 9, 2026

పిల్లల SM వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు: CBN

image

AP: పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు CM చంద్రబాబు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు, శాంతి భద్రతలపై DGP, SPలతో సమావేశమయ్యారు. ’16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.