News November 25, 2024

3 రోజుల్లోనే డబ్బులు జమ: మంత్రి ఉత్తమ్

image

TG: వచ్చే ఏడాది జనవరి 10 వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ సూర్యాపేటలో తెలిపారు. ఇప్పటి వరకు రూ.5,040కోట్ల విలువైన 21.73లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2,760కోట్లు చెల్లించామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా 66లక్షల ఎకరాల్లో 153 లక్షల MTల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. విక్రయించిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Similar News

News December 10, 2024

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జైపుర్ వెళ్తారు. అక్కడ జరిగే బంధువుల వివాహంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మళ్లీ హస్తిన చేరుకుని కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.

News December 10, 2024

మోదీని పడగొట్టాలన్న సొరోస్ వైఖరికే కట్టుబడ్డారా: USకు BJP ప్రశ్న

image

మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న జార్జ్ సొరోస్ వైఖరికే కట్టుబడ్డారో లేదో చెప్పాలని అమెరికాను BJP డిమాండ్ చేసింది. భారత్‌పై విషం చిమ్ముతున్న OCCRP మీడియా సంస్థకు సొరోస్‌తో పాటు US డీప్‌స్టేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని గుర్తుచేసింది. వీటితో చేతులు కలిపే రాహుల్ గాంధీ భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆరోపించింది. OCCRP కొందరి ఒత్తిడితో తప్పుడు రాతలు రాస్తోందని ఫ్రెంచ్ జర్నలిస్టు బయటపెట్టారని తెలిపింది.

News December 10, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’

image

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.