News June 19, 2024
2-3 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు: మంత్రి
TG: ఆయిల్‌పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో పాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అటు 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 10, 2024
నేను ప్రతిపక్షంలోనే ఉన్నా: MLA గాంధీ
TG: తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని శేరిలింగంపల్లి MLA అరికెపుడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానింకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వెల్లడించారు. తనకు CM రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, ఆలయానికి సంబంధించిన శాలువా అని చెప్పారు. గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.
News September 10, 2024
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు
TG: HYDలోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.
News September 10, 2024
అప్పుడు.. రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తాం: రాహుల్ గాంధీ
భారత్ ‘ఫెయిర్ ప్లేస్’గా మారాక కాంగ్రెస్ రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తుందని LoP రాహుల్ గాంధీ USలో అన్నారు. ‘90% ఉన్న OBC, దళిత, ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. టాప్-10 వ్యాపారాలు, మీడియా పరిశ్రమ, బ్యూరోక్రాట్లు, అత్యున్నత కోర్టుల్లో వెనకబడిన వర్గాల వారు కనిపించరు. అందుకే కులగణన అవసరం. ఈ కులాల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకొనేందుకు సోషియో ఎకనామిక్ సర్వే సైతం చేపట్టాలి’ అని ఆయన అన్నారు.