News January 27, 2025
అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

TG: రైతుభరోసా డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News February 16, 2025
మరో వలసదారుల బ్యాచ్‌ను పంపించిన US

116మంది అక్రమ వలసదారులతో కూడిన మరో విమానాన్ని అమెరికా తాజాగా భారత్‌కు పంపించింది. ఈ విమానం నిన్న రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తిరిగొచ్చినవారిలో పంజాబ్(65మంది), హరియాణా(33), గుజరాత్(8మంది), యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తలో ఇద్దరు, హిమాచల్, కశ్మీర్ నుంచి చెరొకరు ఉన్నారు. తొలి దఫా వలసదారుల విమానం ఈ నెల 5న వచ్చిన సంగతి తెలిసిందే.
News February 16, 2025
IPL 2025: హైదరాబాద్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్?

హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్‌లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా SRH తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు సమాచారం. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.
News February 16, 2025
ఈ నెల 19 నుంచి యాదగిరి గుట్ట స్వర్ణగోపుర సంప్రోక్షణ

TG: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 19న మొదలుకానున్నాయి. 23 వరకూ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 23న మహాకుంభాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. తాపడం పనులు ఈ నెల 19కి పూర్తికానున్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణగోపురంగా నిలవనున్న విమాన గోపురానికి 60కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించడం విశేషం.