News January 10, 2025

అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

TG: జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నట్లు CM రేవంత్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. సాగుయోగ్యమైన ప్రతీ ఎకరాకి రైతుభరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్థిరాస్తి, లే ఔట్‌లు, నాలా కన్వర్షన్ అయిన, మైనింగ్, ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.

Similar News

News November 13, 2025

‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

image

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

News November 13, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.in‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.

News November 13, 2025

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.