News March 24, 2024
ట్రేడ్ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు(T+1) సెటిల్‌మెంట్ జరుగుతోంది. ఇకపై ట్రేడ్ జరిగిన రోజే(T+0) సాయంత్రం 4.30లోపు సెటిల్‌మెంట్ చేసేందుకు సెబీ సిద్ధమవుతోంది. ఈ నెల 28న కొత్త బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. 6 నెలలపాటు కేవలం 25 షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకు ఈ సదుపాయాన్ని పరీక్షిస్తుంది. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానుంది.
Similar News
News November 8, 2025
ఈ స్నాక్స్ ట్రై చేయండి

పిల్లలు స్కూల్లో, పెద్దలు ఆఫీసుల్లో తినడానికి బెస్ట్ స్నాక్స్
*వేయించిన శనగలు
*బాదాం లేదా వాల్‌నట్స్
*ఆపిల్ లేదా జామ
*డార్క్ చాక్లెట్లు
*హోం మేడ్ ప్రొటీన్ లడ్డూ
*గుమ్మడి, అవిసె, చియా సీడ్స్
*ఉడకబెట్టిన గుడ్డు
News November 8, 2025
భారత్‌ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

పాక్‌తో సంబంధమున్న ‘ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్‌ని టార్గెట్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్‌తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్‌ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్‌తో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
News November 8, 2025
లోన్లు తీసుకున్నవారికి HDFC శుభవార్త

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు HDFC బ్యాంకు ప్రకటించింది. ఇదివరకు MCLR 8.45-8.65% మధ్య ఉండగా, ఇప్పుడు 8.35%-8.60%కి తగ్గింది. దీంతో ఒకరోజు, నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది, మూడేళ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. నవంబర్ 7 నుంచి కొత్త MCLR రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు పేర్కొంది.


