News December 3, 2024
24 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి నాదెండ్ల
AP: తేమ శాతం సాకుగా చూపి ధాన్యం కొనట్లేదని మాజీ సీఎం జగన్ చేసిన <<14774443>>ఆరోపణలను<<>> మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. ‘మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43మె.టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం 9.14మె.టన్నులు సేకరించింది. ఈ లెక్కలు ఓసారి మీ కళ్లారా చూడండి. సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం. అన్నదాతకు అండగా నిలుస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 15, 2025
చదువుతో పనిలేదు.. మీ వర్క్ పంపండి: ఎలాన్ మస్క్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా వారు తయారుచేసిన బెస్ట్ వర్క్‌ను పంపి తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘మీరు అసలు స్కూల్‌కు వెళ్లకపోయినా, చదవకపోయినా, పెద్ద కంపెనీలో పనిచేయకపోయినా మేం పట్టించుకోం. మీరు everything app(మస్క్ డ్రీమ్ యాప్) రూపొందించాలనుకుంటే మీ బెస్ట్ వర్క్‌ను code@x.comకి పంపండి’ అని ట్వీట్ చేశారు.
News January 15, 2025
చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్
TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.
News January 15, 2025
కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.