News August 27, 2024
మంకీపాక్స్: స్వదేశీ RT-PCR కిట్ సిద్ధం

మంకీపాక్స్‌ను నిర్ధారించే స్వదేశీ RT-PCR కిట్‌ను భారత్ అభివృద్ధి చేసింది. సీమెన్స్ హెల్త్‌నీర్స్ రూపొందించిన IMDX కిట్ల ఉత్పత్తిని CDSCO ఆమోదించింది. ఏటా 10 లక్షల సామర్థ్యం గల వడోదరాలోని ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. ఇవి మంకీపాక్స్ వైరస్ క్లాడ్ 1, 2 వేరియంట్లను సమర్థంగా గుర్తిస్తాయంది. సాధారణంగా 1-2 గంటలు పట్టే ఫలితం తమ కిట్‌తో 40 నిమిషాల్లోనే వస్తుందని పేర్కొంది.
Similar News
News November 15, 2025
8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

మహిళల క్రికెట్‌కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.
News November 15, 2025
రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.
News November 15, 2025
SAతో తొలి టెస్ట్.. భారత్‌కు మెరుగ్గా విన్నింగ్ ఛాన్స్!

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో SA 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో సఫారీలు ఉన్నారు. క్రీజులో బవుమా(29), బాష్(1) ఉన్నారు. రేపు మిగతా 3 వికెట్లను త్వరగా కూల్చేస్తే IND గెలుపు నల్లేరుపై నడకే.
* స్కోర్లు: SA.. 159/10, 93/7; భారత్ 189/10


