News November 27, 2024
వక్ఫ్ బిల్లుపై మరింత గడువు కావాలి: జేపీసీ

వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద సవరణల్ని పరిశీలించేందుకు 2025 బడ్జెట్ సెషన్ ముగింపు వరకు టైమ్ అడగాలని పార్లమెంటు జాయింట్ కమిటీ(JPC) నిర్ణయించింది. ఈరోజు జరిగిన జేపీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. అందుకోసం లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. వక్ఫ్ విషయంలో తమకు పలు ప్రశ్నలున్నాయని, వాటి సమాధానాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
ఈనెల 21న ‘OG’ ట్రైలర్

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిన ‘OG’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 21న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తామంటూ పోస్టర్ను విడుదల చేశారు. ఈనెల 25న విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా టికెట్ <<17742687>>ధరలను<<>> పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. తెలంగాణలో ధరలు పెరుగుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!