News November 27, 2024

వక్ఫ్ బిల్లుపై మరింత గడువు కావాలి: జేపీసీ

image

వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద సవరణల్ని పరిశీలించేందుకు 2025 బడ్జెట్ సెషన్ ముగింపు వరకు టైమ్ అడగాలని పార్లమెంటు జాయింట్ కమిటీ(JPC) నిర్ణయించింది. ఈరోజు జరిగిన జేపీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. అందుకోసం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. వక్ఫ్ విషయంలో తమకు పలు ప్రశ్నలున్నాయని, వాటి సమాధానాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2024

‘కన్నప్ప’లో మంచు విష్ణు కూతుళ్లు

image

‘కన్నప్ప’ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు సినీ అరంగేట్రం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అరియానా- వివియానాలు ఢమరుకంతో నాట్యం చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News December 2, 2024

ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలిస్తోంది: CM రేవంత్

image

TG: పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోందని CM రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ ఇందిరమ్మ పాలన అని ‘X’లో పోస్ట్ చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని, ఇది హర్షణీయం అని పేర్కొన్నారు. అటు, సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించనున్న CM కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.

News December 2, 2024

Rewind24: లక్షన్నర జాబులు పోయాయి

image

ఈ ఏడాది టెక్ ప్రపంచం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఇంటెల్, టెస్లా, SAP, Uber, డెల్, మైక్రోసాఫ్ట్, సిస్కో సహా దిగ్గజ కంపెనీల్లో దాదాపు 1.5 లక్షల మందికి పింక్ స్లిప్స్ జారీ అయ్యాయి. ఖర్చుల పొదుపు, టీమ్స్ & కంపెనీ రీస్ట్రక్చరింగ్, AI వంటి కొత్త టెక్నాలజీలు, మార్కెట్ మార్పులకు అనుగుణంగా సన్నద్ధమవడం కోసం యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.
<<-se>>#Rewind24<<>>