News August 30, 2024
హైడ్రాకు మరింత పవర్
TG: అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రాను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిధిని విస్తృతం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలు అప్పగించనుంది. ప్రస్తుతం ఇరిగేషన్, GHMC, మున్సిపల్, పంచాయతీ శాఖలు వేర్వేరుగా నోటీసులు ఇవ్వడంతో అయోమయం నెలకొనగా, ఇకపై HYDRA నేరుగా నోటీసులు ఇవ్వనుంది. త్వరలోనే అదనపు అధికారులు, సిబ్బందిని హైడ్రాకు కేటాయించనుంది.
Similar News
News September 21, 2024
కొత్త మద్యం షాపులు.. దరఖాస్తుల ద్వారానే రూ.400 కోట్ల ఆదాయం
AP: నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేట్ లిక్కర్ షాపులకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,736 దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటికి నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుం రూ.2లక్షలుగా నిర్ధారించారు. దాదాపు 15-20వేల అప్లికేషన్లు రావొచ్చని అంచనా. అలాగే 12 ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ స్టోర్లకు భారీగా ఫీజు ఉంటుంది. మొత్తంగా దరఖాస్తుల ద్వారానే రూ.300-400 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా.
News September 21, 2024
లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక
ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.
News September 21, 2024
చరిత్ర సృష్టించిన అఫ్గాన్
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.