News April 15, 2025
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 105 శాతంగా నమోదవుతుందని IMD చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. సీజన్ మొత్తం ఎల్‌నినో పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. దీంతో దేశంలో వర్షాకాలం మొదలైందని పేర్కొంటారు.
Similar News
News April 18, 2025
IPL: అభిషేక్ జేబులు చెక్ చేసిన సూర్య కుమార్

MI, SRH మధ్య నిన్న ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. SRH ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశారు. ఇటీవల పంజాబ్‌పై సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ జేబులోంచి నోట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితమంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లోనూ అలానే నోట్ రాసుకొచ్చారేమో అని SKY చెక్ చేయడం గ్రౌండ్లో నవ్వులు పూయించింది.
News April 18, 2025
కీవ్‌లో భారత ఫార్మా గోడౌన్‌పై దాడి.. ఉక్రెయిన్‌కు రష్యా కౌంటర్

కీవ్‌లో APR 12న భారత ఫార్మా గోడౌన్‌పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్‌లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది.
News April 18, 2025
కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.