News September 1, 2024

3వేలకు పైగా ఉద్యోగాలు.. వచ్చే నెలలో నోటిఫికేషన్?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో 3వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల సంఖ్య ఖరారైతే వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది.

Similar News

News September 14, 2024

ఉత్సవాల్లో పిచ్చివేషాలు.. ఆకతాయిలపై షీ టీమ్స్ పంజా

image

TG: గణేశ్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిలపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. మొత్తం 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఉత్సవాల్లో మహిళల భద్రతపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు మహిళా పోలీస్ విభాగం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News September 14, 2024

విషాదం: టీ పౌడర్ అనుకొని..

image

AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News September 14, 2024

కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్

image

హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.