News August 1, 2024
ఒక్క రోజే 50లక్షలకు పైగా ITRల దాఖలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITRల దాఖలుకు నిన్నటితో గడువు ముగిసింది. నేటి నుంచి చేయాలంటే రూ.5000 వరకు ఫైన్+వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చివరి రోజైన నిన్న(జులై 31) ఒక్క రోజే 50లక్షలకు పైగా ITRలు నమోదైనట్లు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. మొత్తం 7కోట్లకు పైగా ITRలు దాఖలైనట్లు పేర్కొంది. ట్యాక్స్ పేయర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది.
Similar News
News December 11, 2024
ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’!
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్‌పై 2024 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేసింది. అనంతరం ఈ వ్యాధితో నటి పూనమ్ పాండే మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించడం సంచలనమైంది. అయితే అదో స్టంట్‌గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహన కల్పించడానికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశామని <<14840427>>Yes Madam<<>> ప్రకటించింది. ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
News December 11, 2024
తొలి T20లో పోరాడి ఓడిన పాకిస్థాన్
సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న పాకిస్థాన్ డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఓడింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రిజ్వాన్ చివరి వరకు పోరాడినా(74 రన్స్) విజయం దక్కలేదు. దీంతో సౌతాఫ్రికా 11పరుగుల తేడాతో గెలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్ 40 బంతుల్లో 82 రన్స్ చేశారు. 48 రన్స్ చేయడంతో పాటు 4 వికెట్లు తీసిన జార్జ్ లిండేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.
News December 11, 2024
మూడు పూటలూ అన్నమే తింటున్నారా?
చాలామంది ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా అన్నం తినకుండా ఉండలేరు. మూడు పూటలా అదే తింటారు. కానీ అన్నం ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ వచ్చే ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో జీర్ణ సమస్యలతోపాటు ఊబకాయం బారిన పడే ఛాన్స్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అన్నానికి బదులు ఒకపూట ఇతర ఆహార పదార్థాలు తినడం బెటర్.