News June 19, 2024
హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటివరకు 550 మందికి పైగా యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు. 60 మంది జోర్డానియన్లు కూడా మృతి చెందారన్నారు. ప్రస్తుతం మక్కాలో 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 240కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
Similar News
News September 13, 2024
BREAKING: మరో అల్పపీడనం
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.
News September 13, 2024
నందిగం సురేశ్‌కు పోలీస్ కస్టడీ
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనను ఈనెల 5న హైదరాబాద్‌లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని, 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈనెల 15-17 వరకు 2 రోజులకే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సురేశ్ గుంటూరు జైలులో ఉన్నారు.
News September 13, 2024
రైలులో బాలికపై లైంగిక వేధింపులు.. కొట్టి చంపేసిన ప్రయాణికులు
బరౌనీ(బిహార్) నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో 11ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. చిన్నారి ఏడుస్తూ తల్లికి విషయం చెప్పగా, ఆమె మరో బోగీలోని కుటుంబీకులకు సమాచారాన్ని అందించింది. తోటి ప్రయాణికులతో కలిసి వారు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు.