News December 11, 2024
వైద్యులు, ఆర్మీ, టీచర్లపైనే ఎక్కువ నమ్మకం!
ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ప్రజలు వైద్యులపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నట్లు తేలింది. 2024లో IPSOS జరిపిన సర్వేలో ఇండియాలో 57శాతం మంది డాక్టర్ వృత్తిపై ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. దీంతోపాటు ఆర్మీ ఆఫీసర్లను 56%, టీచర్లను 56%, సైంటిస్టులను 54%, జడ్జిలను 52%, బ్యాంకర్స్‌ను 50%, పోలీసులను 47 శాతం మంది నమ్ముతున్నారు. కాగా, రాజకీయ నాయకులు అట్టడుగున ఉన్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.
Similar News
News January 20, 2025
నాగ సాధువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?
నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. దీనికి కారణం వారు ఎలాంటి కోరికలు లేకుండా ఉండటమే. మనిషి ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని ఇదే సహజ స్థితి అని వారు నమ్ముతారు. ఈ భావనతోనే వారు దుస్తులు ధరించరని చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించేందుకు పవిత్రమైనదిగా భావించే బూడిదను ఒంటికి పూసుకుంటారు. వారు చేసే సాధనలు, అభ్యాసాలతో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తారు.
News January 20, 2025
అమెరికాలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రభంజనం
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అమెరికాలో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో లేని విధంగా పండగకు ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపింది. మరోవైపు ఓవరాల్‌గా ఈ సినిమా కలెక్షన్లు రూ.200 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News January 20, 2025
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమిటి?: కేటీఆర్
TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.