News November 19, 2024
Morning ఇన్వెస్ట్.. ఈవెనింగ్ Square Off
స్టాక్ మార్కెట్‌లో మంగళవారం Short-term Buying వల్ల సూచీలు ఉదయం భారీ లాభాల్లో పయనించాయి. అయితే High Volatility, FIIల ఔట్ ఫ్లో, Q2 వీక్ ఎర్నింగ్స్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. $ క్రమంగా బలపడుతుండడం, US ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల FIIలు Square Off చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం, RBI వడ్డీ రేట్ల కోత ఆలస్యం మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.
Similar News
News December 2, 2024
‘ది సబర్మతి రిపోర్ట్’ వీక్షించనున్న మోదీ
ప్రధాని మోదీ ఇవాళ ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను వీక్షించనున్నారు. పార్లమెంట్ హాల్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. గోద్రా అల్లర్ల ఘటన కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు.
News December 2, 2024
ఇళ్ల ధరల్లో పెరుగుదల ఇలా!
ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో గతేడాది నుంచి జరిగిన హెచ్చుతగ్గులను TNIE నివేదించింది. హౌసింగ్ ధరలు చదరపు గజానికి సగటున రూ.11వేలు ఉన్నట్లు తేలింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ముంబైలలో 2023 Q3 నుంచి 2024 Q4 వరకు ఇళ్ల ధరలను పరిశీలించారు. HYDలో స్క్వేర్ ఫీట్‌కు రూ.11,040 నుంచి ఇప్పుడు రూ.11,351కి పెరిగింది. ఇక్కడ 3శాతం వృద్ధిరేటు కనిపించింది.
News December 2, 2024
నేడే ‘సైబర్ మండే’.. అంటే ఏమిటి?
ఈకామర్స్ సైట్లలో ఇవాళ సైబర్ మండే సేల్ నడుస్తోంది. అమెరికాలో నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్ డే’ ఉంటుంది. ఆరోజు వ్యాపారులు భారీ ఆఫర్లు ఇస్తుంటారు. దీనికి పోటీగా ఆన్‌లైన్ షాపింగ్ పెంచేందుకు ఈ-రిటైలర్లు 2005లో ‘సైబర్ మండే’ ఆఫర్ సేల్ ప్రకటించారు. థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి సోమవారం ఇది ఉంటుంది (ఈసారి DEC 2). USA నుంచి ఇతర దేశాలకు పాకిన ఈ స్ట్రాటజీ ఇప్పుడు భారత్‌నూ తాకింది.