News October 12, 2024
కూతురి హత్యకు తల్లి సుపారీ.. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే..
ప్రేమలో ఉన్న కూతురిని హత్య చేయించాలనుకుందో తల్లి. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి సుపారీ ఇచ్చింది. అయితే ఆ కిల్లర్ తల్లినే చంపేశాడు. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే.. కూతురి లవర్ ఆ కిల్లరే! ఈ నేరకథా చిత్రం యూపీలో చోటుచేసుకుంది. ఈ నెల 6న మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విషయం వెలుగుచూసింది. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
Similar News
News November 11, 2024
16లో 10.. మజ్లిస్ ‘మహా’ టార్గెట్!
మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.
News November 11, 2024
బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సూర్య
సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయని, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
News November 11, 2024
యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు ట్రంప్ సూచన
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడినట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై ఇరువురూ చర్చించారని తెలిపింది. వీలైనంత త్వరగా వివాదానికి ముగింపు పలకాలని ట్రంప్ సూచించినట్లు పేర్కొంది. అమెరికా-రష్యా సంబంధాల పునరుద్ధరణకు పిలుపునిచ్చినట్లు రాసుకొచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు <<14566201>>జెలెన్‌స్కీతోనూ<<>> ట్రంప్ చర్చించారు.