News December 17, 2024
లక్షల్లో మొక్కలు నాటిన ‘తల్లి’ మృతి
ప్రఖ్యాత పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె చనిపోయారు. కర్నాటకలోని హొన్నాలికి చెందిన ఈమె ‘మదర్ ఆఫ్ ట్రీ’గా పేరు తెచ్చుకున్నారు. 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ లక్షలాది మొక్కలను నాటారు. మొక్కల గురించి అసమానమైన పరిజ్ఞానం ఉండటంతో ఆమెను ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్’ అని పిలుస్తుంటారు.
Similar News
News January 22, 2025
మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.
News January 22, 2025
భారత్ పిచ్‌పై తేలిపోయిన RCB బ్యాటర్లు!
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
News January 22, 2025
GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్
హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్‌పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.