News July 25, 2024

వాహనదారులారా జాగ్రత్త.. ఇకపై బాదుడే

image

AP: జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. లైసెన్స్ లేకపోతే రూ.5వేలు, డ్రంక్ అండ్ డ్రైవ్ రూ.10 వేలు, హెల్మెట్ లేకుంటే రూ.1000 జరిమానాతో పాటు 3నెలలు లైసెన్స్ రద్దు, ట్రిపుల్ రైడింగ్ రూ.1200, ఇన్సూరెన్స్, సీటు బెల్ట్ లేకుంటే రూ.2000, రూ.1000 ఫైన్ విధిస్తామని వెల్లడించారు.

Similar News

News December 9, 2024

కేజీ టమాటా రూపాయి

image

AP: నిన్నమొన్నటి వరకు రైతులకు లాభాలు ఆర్జించి పెట్టిన టమాటా ఒక్కసారిగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో కిలో టమాటా ధర ఏకంగా రూపాయికి పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లేక అన్నదాతలు టమాటాలను పారబోస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సహా పలు నగరాల్లో కేజీ టమాటా రూ.30-40 పలుకుతోంది.

News December 9, 2024

పుష్ప క్రేజ్: ఆప్‌-బీజేపీ మ‌ధ్య‌ పోస్ట‌ర్‌ వార్‌

image

పుష్ప మేనియా ఢిల్లీని ఊపేస్తోంది. Febలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో రాజ‌కీయ పార్టీలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు పుష్ప పోస్ట‌ర్ల‌ను వాడుకుంటున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్‌-4, తగ్గేదే లే అంటూ ఆప్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. దీనికి కౌంట‌ర్‌గా ఆప్ అవినీతిని ఇక అంతం చేస్తామ‌ని, ర‌ప్పా ర‌ప్పా అంటూ పార్టీ స్టేట్ చీఫ్ వీరేంద్రతో కూడిన పోస్ట‌ర్‌ను BJP విడుద‌ల చేసింది.

News December 9, 2024

మ‌హ్మ‌ద్ యూన‌స్‌తో విక్ర‌మ్ మిస్త్రీ బృందం భేటీ

image

బంగ్లా తాత్కాలిక చీఫ్ మ‌హ్మ‌ద్ యూన‌స్‌తో భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్త్రీ బృందం స‌మావేశ‌మైంది. సోమ‌వారం ఇరుదేశాల మ‌ధ్య జరిగిన అత్యున్న‌త స్థాయి స‌మావేశం అనంతరం యూనస్‌ను కలిసింది. ఇరుదేశాల మ‌ధ్య అన్ని రంగాల్లో స‌హకారం కొన‌సాగింపు, సంయుక్త ప్ర‌యోజ‌నాల‌పై క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు భార‌త్ పేర్కొంది. అలాగే బంగ్లాలో మైనారిటీల భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరింది.