News February 15, 2025
అలాంటి కథలతో సినిమాలు తీయాలి: మంత్రి సత్యకుమార్

AP: సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతమైన సినిమాలు తీయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వీరప్పన్, పూలన్ దేవి లాంటి బందిపోట్లు, స్మగ్లర్ల జీవితకథలతో సినిమాలు తీయడమేంటని ప్రశ్నించారు. వీటితో చిన్నారులను స్మగ్లర్లుగా మార్చమని సందేశమిస్తున్నారా అని అన్నారు. జన్మించిన ఊరు కోసం, సమాజం కోసం మంచి చేసే వారి కథలు సినిమాలుగా తీయాలని సూచించారు.
Similar News
News March 28, 2025
500 మంది భారతీయ ఖైదీలకు UAE క్షమాభిక్ష

రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు UAE ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. మరోవైపు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1518 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 500 మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. ఇది ఇండియా-UAE మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
News March 28, 2025
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో ఉద్యోగులు ఫెయిల్!

ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో సంతృప్తిగా లేనట్లు ‘జీనియస్ కన్సల్టెంట్స్’ సర్వేలో తేలింది. పని వేళల వల్ల రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నామని 52% మంది అభిప్రాయపడ్డారు. ప్రతి ముగ్గురిలో ఒక్కరే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. పనికి తగ్గ వేతనాలు కంపెనీ చెల్లించట్లేదని 68% మంది భావిస్తున్నారు. మెంటల్ హెల్త్, శ్రేయస్సు గురించి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే సంతోషపడతామని 89% మంది చెప్పారు.
News March 28, 2025
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.