News April 4, 2024
ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె ‘మోచి’ కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, ఆమె SCని ఆశ్రయించారు. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి BJP MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
Similar News
News April 4, 2026
కాలం మారినా మన భూమి అందం మారలేదు!

చంద్రుడి కక్ష్యలోకి మనిషి వెళ్లిన 54 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ NASA ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 1972లో అపోలో-17 వ్యోమగాములు తీసిన ఫొటోను, తాజాగా ఆర్టెమిస్-2 బృందం తీసిన చిత్రాన్ని పోల్చుతూ ట్వీట్ చేసింది. ‘కాలం మారినా అంతరిక్షం నుంచి మన భూమి అందం మాత్రం అస్సలు తగ్గలేదు’ అని పేర్కొంది. ఈ రెండు చిత్రాలు నాటి జ్ఞాపకాలను, నేటి సాంకేతిక అభివృద్ధిని మనకు గుర్తుచేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
News April 4, 2026
ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఆ గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లు నిషేధం!

TG: ఐస్‌క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని 3 గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. ఆర్మూర్(M) అంకాపూర్, జక్రాన్‌పల్లి(M) కొలిపాక, వేల్పూర్(M) అంక్సాపూర్ గ్రామాలు దీనిపై తీర్మానం చేశాయి. నిబంధన ఉల్లంఘిస్తే ₹5వేల జరిమానా విధిస్తామని ప్రకటించాయి. ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో ఐస్‌క్రీమ్ కల్తీలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
News April 4, 2026
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కూ షూ, బెల్ట్

TG: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ షూ, బెల్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇస్తున్న యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలకు ఇవి అదనం. వీటితో పాటు కొత్తగా బెల్ట్, బ్లాక్ షూ, రెండు జతల సాక్సులను జూన్ 12 నుంచే అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా 18రకాల వస్తువులు ఇవ్వనున్నారు.


