News August 30, 2024
MPP, ZPTCలను చూసి MPలు బుద్ధి తెచ్చుకోవాలి: అంబటి

AP: పార్టీలు మారే ఎంపీలు MPP, ZPTCలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలో లేకపోయినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ‘ఎవరు పోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. నిజాయితీగా ఉన్నవారు పార్టీలు మారరు. జెత్వానీ కేసులో సజ్జలను ఏదో చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి బూమరాంగ్ తప్పదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News December 11, 2025
మహిళల ఆరోగ్యానికి ఎలాంటి విటమిన్లు కావాలంటే?

చాలామంది మహిళలు విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మహిళల ఆరోగ్యంలో విటమిన్లు, ఖనిజాల సమతుల్య వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యం నుంచి హార్మోన్ల వరకు, విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ D3, విటమిన్ C, విటమిన్ B12, విటమిన్ B9, విటమిన్ B6తో సహా అవసరమైన విటమిన్ల సమతుల్య వినియోగం మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
గుడికి ఎందుకు వెళ్లాలి?

ఆలయ ప్రాంగణంలో సానుకూల శక్తి ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉండే శక్తిమంతమైన తరంగాలు మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. గంట చప్పుడు, హారతి, పూల పరిమళం, చెప్పులు లేకుండా నడవడం, కుంకుమ ధరించడం.. ఈ ప్రక్రియలు మన పంచేంద్రియాలను జాగృతం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. తీర్థంలోని తులసి, రాగి శారీరక సమస్యలను దూరం చేస్తాయి. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ఆలయాలకు వెళ్లాలి. మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 11, 2025
చలికాలం.. పాడి పశువుల సంరక్షణ (1/2)

రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువుల షెడ్లలో కరెంటు బల్బులను ఏర్పాటు చేసి వెలుతురు, వేడిని అందించాలి. రాత్రివేళ పశువులను ఉంచే పాకలు, కొట్టాలు, షెడ్ల చుట్టూ గోనెసంచులతో లేదా తడికెలతో కప్పి ఉంచాలి. తడిగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను ఉంచకూడదు. పశువులకు గోరువెచ్చని నీటిని అందించాలి. చలికాలానికి సంబంధించి పశువులకు వెటర్నరీ వైద్యులు సూచించిన మేతను అందించాలి.


