News August 30, 2024
MPP, ZPTCలను చూసి MPలు బుద్ధి తెచ్చుకోవాలి: అంబటి
AP: పార్టీలు మారే ఎంపీలు MPP, ZPTCలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలో లేకపోయినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ‘ఎవరు పోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. నిజాయితీగా ఉన్నవారు పార్టీలు మారరు. జెత్వానీ కేసులో సజ్జలను ఏదో చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి బూమరాంగ్ తప్పదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News September 11, 2024
అప్పుడు మోడల్.. ఇప్పుడు మేడమ్
యూపీలోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి మోడల్‌గా ఎదిగి ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో డిగ్రీ చదివే సమయంలో ఆమె కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అది చూసిన కొన్ని సంస్థలు ఆమెకు మోడలింగ్ అవకాశమిచ్చాయి. ఆ తర్వాత మోడలింగ్‌ను పక్కనపెట్టి 2022లో సివిల్స్ ఫలితాల్లో 116వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఇన్‌స్టాలో ఆమెకు 271K ఫాలోవర్లు ఉన్నారు.
News September 11, 2024
ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?
ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
News September 11, 2024
ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు
ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.