News September 12, 2024

OTTలోకి వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’, ‘ఆయ్’

image

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. గత నెల 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు నార్నె నితిన్ నటించిన ‘ఆయ్’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

Similar News

News October 10, 2024

టాటా మరణంపై మమత ట్వీట్: మొసలి కన్నీరు వద్దన్న నెటిజన్స్

image

రతన్ టాటా మరణం భారత వ్యాపార రంగానికి తీరని లోటన్న బెంగాల్ CM మమతా బెనర్జీ ట్వీటుపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. సింగూరులో టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నానో’ను అడ్డుకొని ఇప్పుడు మొసలి కన్నీరు ఎందుకంటూ నిలదీస్తున్నారు. ‘మీ వల్ల టాటాకు చాలా నష్టమొచ్చింది. ఇక చాలు’, ‘సింగూరు నుంచి టాటా వెళ్లిపోయినప్పుడే నువ్వు ఓడిపోయావ్’, ‘మీ రాజకీయ వృద్ధి కోసం సింగూరు అభివృద్ధిని అడ్డుకున్నారు’ అని కామెంట్స్ పెడుతున్నారు.

News October 10, 2024

ఒక్క ఓటమి.. కాంగ్రెస్‌పై మారిన ‘INDIA’ పార్టీల స్వరం

image

హరియాణాలో ఓటమి తర్వాత INDIA కూటమి పార్టీల స్వరం మారింది. విజయాన్ని ఓటమిగా మార్చే కళను కాంగ్రెస్ నుంచి నేర్చుకోవచ్చని శివసేన UBT సెటైర్ వేసింది. EVMతోనే గెలుస్తారు, ఓడితే నిందిస్తారని ఒవైసీ డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘అహంకారం, అధికారం జన్మహక్కన్న ఫీలింగ్’ అని TMC పరోక్షంగా విమర్శించింది. SP కనీసం కాంగ్రెస్‌ను అడగకుండా UP బైపోల్స్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది. అంతర్మథనం చేసుకోండని CPI సలహా ఇచ్చింది.

News October 10, 2024

ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉ.10.30 గంటలకు NCPA గ్రౌండ్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.