News August 6, 2024
జిల్లా ఆస్పత్రుల్లో త్వరలో MRI, సీటీ స్కాన్ సేవలు: ప్రభుత్వం
TG: HYDలోని ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో అందించే వైద్య సేవలను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు సీనియర్ డాక్టర్లను జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేసింది. అన్ని ఆస్పత్రుల్లో MRI, సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మెషీన్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. సిటీలోని ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపింది.
Similar News
News January 16, 2025
ఇండియా ఓపెన్: ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక, ఆకర్షి ఓడిపోయారు. మరోవైపు ఇవాళ స్టార్ ప్లేయర్ సింధు జపాన్ క్రీడాకారిణి సుజుతో తలపడనున్నారు. మరో ప్లేయర్ అనుపమ ఉపాధ్యాయ జపాన్‌కు చెందిన మియజాకితో పోటీ పడనున్నారు.
News January 16, 2025
‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు
ఈ నెల 17 నుంచి మరో 20 నిమిషాల అదనపు నిడివితో ‘పుష్ప-2’ ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంతో పాటు నార్త్ ఇండియాలో టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటికే రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది.
News January 16, 2025
కోర్టుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి: SC
దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, స్త్రీలు, పురుషుల కోసం వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(SC) ఆదేశించింది. ఇది సౌకర్యానికి సంబంధించినది కాదని కనీస అవసరమని పేర్కొంది. వీటి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వం, స్థానిక అధికారులదని తెలిపింది. కోర్టు ఆవరణల్లో సామాన్యులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.