News March 20, 2024
విజయ్‌తో మృణాల్ సెల్ఫీ
‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పరుశురామ్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుండగా విజయ్, మృణాల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా వీరు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృణాల్.. విజయ్‌తో సెల్ఫీ దిగారు.
Similar News
News September 10, 2024
నేరుగా ఓటీటీలోకి శోభిత కొత్త మూవీ
అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లవ్, సితార’. వందన కటారియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 27 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
News September 10, 2024
జననాల రేటు పెంచేందుకు కిమ్ ఏం చేశారంటే?
ఉత్తర కొరియాలో జననాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అబార్షన్లు చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ కొందరు వైద్యులు రహస్యంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇలా చేయకుండా ఉండేందుకు వైద్యుల జీతాలను భారీ పెంచారు. కానీ కొందరు మారకపోవడంతో దొరికిన వైద్యులకు జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా ఎక్కువ మంది పిల్లలున్న వారికి గృహాలు, ఆహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
News September 10, 2024
నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం: శ్రీధర్ బాబు
TG: పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను BRS ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.