News August 19, 2024

ముడా స్కామ్: హైకోర్టును ఆశ్రయించిన సిద్దరామయ్య

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ముడా స్కామ్‌లో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతివ్వడాన్ని సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతిని బట్టి ఆయన పిటిషన్‌ను నేటి మధ్యాహ్నం లేదా మంగళవారం విచారిస్తామని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తెలిపారు. మైసూరు నగరాభివృద్ధి సంస్థలో భూకుంభకోణం జరిగిందన్న సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు.

Similar News

News September 21, 2024

Learning English: Synonyms

image

✒ Important: Necessary, Vital
✒ Interesting: Bright, Intelligent
✒ Keep: Hold, Maintain, Sustain
✒ Kill: Slay, Execute, Assassinate
✒ Lazy: Indolent, Slothful, Idle
✒ Little: Dinky, Puny, Diminutive
✒ Look: Inspect, Survey, Study
✒ Love: Like, Admire, Esteem
✒ Make: Design, Fabricate

News September 21, 2024

తిరుమల లడ్డూ వివాదం.. కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్

image

తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ వేలాది ALT అకౌంట్లలో ఒకే తరహా ట్వీట్లు రావడంపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2-3 ఏళ్లుగా శ్రీవారి లడ్డూ రుచి చూడగానే మా అమ్మ అనారోగ్యం పాలయ్యేది. దాన్ని ఎక్కువగా తినొద్దని మాకు చెప్పేది. అందులో ఏదో తప్పుగా జరుగుతోందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ ట్వీట్లు వచ్చాయి. దీంతో అందరికీ ఒకే అమ్మ ఉందా అనే అర్థంలో ‘వన్ నేషన్.. వన్ మామ్’ అని INC రాసుకొచ్చింది.

News September 21, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలం తగ్గిపోయి చిక్కిపోయినప్పుడు సింహాన్ని కూడా కుక్క కరవగలదు. అందువల్ల మనకు బలం లేనప్పుడు పంతానికి పోవడం మంచిది కాదు.