News October 1, 2024

ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య

image

ముడా స్కామ్‌కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.

Similar News

News January 26, 2026

TGలోనూ ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు: లక్ష్మణ్

image

TG: దేశవ్యాప్తంగా జనగణన 6 నెలల్లోనే పూర్తవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్‌తోపాటు ఇతర ప్రక్రియ అంతా ఎన్నికలలోపే పూర్తవుతాయన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News January 26, 2026

T20 వరల్డ్‌ కప్‌ జట్టులోకి రియాన్ పరాగ్!

image

T20 వరల్డ్‌ కప్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో రియాన్ పరాగ్‌ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరాగ్‌ను ఫిబ్రవరి 2న ముంబైలో రిపోర్ట్ చేయమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయి ఉన్నప్పటికీ WCలో ఆల్‌రౌండర్‌ కోసం సెలక్టర్లు చూస్తున్నారు.

News January 26, 2026

జెండా ఆవిష్కరణ.. ఈ తేడాలు తెలుసా?

image

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT