News October 1, 2024
ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య
ముడా స్కామ్‌కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.
Similar News
News October 11, 2024
APPLY NOW.. 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
TG: 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 16, 17 తేదీల్లో సవరణలు చేసుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో అత్యధికంగా 1576 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.36,750-రూ.1,06,990 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News October 11, 2024
సురేఖను తప్పిస్తారనేది ప్రత్యర్థుల ప్రచారమే: TPCC చీఫ్
TG: కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సమంత, నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ వ్యవహారం అప్పుడే ముగిసిందని అన్నారు. AICC నేతలంతా బిజీగా ఉండటం వల్లే మంత్రి వర్గం, PCC కార్యవర్గం ఆలస్యమైందని తెలిపారు. దీపావళిలోపు రెండో విడత కార్పొరేషన్ పదవుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.
News October 11, 2024
ముల్తాన్‌లో మూడు డాట్స్ ఆడితే ఔటివ్వాలి: నాసిర్
ముల్తాన్ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పిచ్‌పై వికెట్లు పడవని, గల్లీ క్రికెట్ తరహాలో వరసగా మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్ అన్నట్లుగా రూల్స్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు. ‘టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్ అసలు అక్కర్లేదు. తొలి 3 రోజుల పాటు మరీ ఫ్లాట్‌గా ఉంది. టెస్టుల్లో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉండాలి’ అని పేర్కొన్నారు.