News February 5, 2025

బీసీల్లో ముదిరాజ్‌లు టాప్, ఆ తర్వాత యాదవులు

image

తెలంగాణలో కులగణన సర్వేలో 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని తేలింది. వీరిలో 26 లక్షలకు పైగా జనాభాతో ముదిరాజ్‌లు టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు, 16 లక్షల జనాభాతో గౌడ కులస్థులు, ఆ తర్వాత 13.70 లక్షల జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం బీసీ జనాభాలో ఈ ఐదు కులాలే సగానికి పైగా ఉన్నట్లు తేలింది.

Similar News

News February 11, 2026

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

image

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

News February 11, 2026

గోడ‌పై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

image

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.

News February 11, 2026

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ 34 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in