News October 25, 2024

ముద్ర రుణాల పరిమితి పెంపు

image

ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.

Similar News

News November 28, 2025

పిల్లలకు రాగిజావ ఎప్పుడివ్వాలంటే?

image

పసిపిల్లల్లో జీర్ణవ్యవస్థ రోజురోజుకూ వృద్ధి చెందుతుంటుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యే రాగిజావను 6-8 నెలల మధ్యలో అలవాటు చేయొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయానికల్లా పిల్లల్లో చాలావరకూ తల నిలబెట్టడం, సపోర్టుతో కూర్చోవడం లాంటి మోటార్‌ స్కిల్స్‌ డెవలప్‌ అయి ఉంటాయి కాబట్టి వాళ్లు ఆ రుచినీ, టెక్‌స్చర్‌నీ గ్రహిస్తారు. మొదట తక్కువ పరిమాణంతో మొదలుపెట్టి, అలవాటయ్యే కొద్దీ పరిమాణం పెంచుకుంటూ వెళ్లొచ్చు.

News November 28, 2025

మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

image

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 28, 2025

HYD మెట్రోకు 8 ఏళ్లు

image

TG: రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన HYD మెట్రో మొదలై నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 28న PM మోదీ ఫస్ట్ ఫేజ్‌ను ప్రారంభించగా 29 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3 కారిడార్లలో రోజూ 57 రైళ్లు దాదాపు 1,100 ట్రిప్పులు తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. నిత్యం 4-5లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ మెట్రోను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.