News January 3, 2025

మహేశ్ వాయిస్‌తో ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ సక్సెస్!

image

‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో అదరగొడుతోంది. హాలీవుడ్‌లో రూ.వేల కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. అయితే, అమెరికా బాక్సాఫీస్ వద్ద తెలుగు వెర్షన్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు $31,771, హిందీకి $11,240, తమిళానికి $1,659 కలెక్షన్లు వచ్చాయి. మహేశ్ వాయిస్ ఇవ్వడం వల్ల దీనికి మరింత ఆదరణ లభించిందని సినీవర్గాలు తెలిపాయి.

Similar News

News January 14, 2025

‘డాకు మహారాజ్’ 2 రోజుల కలెక్షన్లు ఇవే..

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ.74 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. కాగా ఈ మూవీ తొలి రోజైన ఆదివారం రూ.56 కోట్లు వసూలు చేసింది.

News January 14, 2025

శివకార్తికేయన్ ఫ్యామిలీని చూశారా?

image

తమిళ హీరో శివకార్తికేయన్ ఇటీవల వచ్చిన అమరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఫ్యామిలీ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరోకు భార్య ఆర్తి, ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శివకార్తికేయన్, ఆర్తి 2010లో పెళ్లి చేసుకున్నారు.

News January 14, 2025

పండగ వేళ తగ్గిన బంగారం ధరలు

image

సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.