News June 24, 2024
చరిత్ర సృష్టించిన మహ్మద్ నబీ..!
అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ చరిత్ర సృష్టించారు. 45 దేశాలపై అఫ్గాన్ సాధించిన విజయాల్లో ఆయన భాగమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, కెనడా, కెన్యా, యూఏఈ, యూఎస్ఏ, ఒమన్, సౌదీ అరేబియా, డెన్మార్క్, జపాన్, చైనా, కువైట్ తదితర దేశాలపై ఆయన ఆడారు.
Similar News
News November 12, 2024
విజన్-2047 కోసం సలహాలివ్వండి: చంద్రబాబు
AP: బడ్జెట్ సమావేశాలపై MLAలు అవగాహన పెంచుకోవాలని CM చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన MLAలు, MLCలతో వర్క్‌షాపులో CM మాట్లాడారు. ‘ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. MLAలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. సభలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. విజన్2047పై సలహాలు ఇవ్వాలి’ అని CM కోరారు.
News November 12, 2024
అత్యవసర విచారణ ప్రక్రియలో కీలక మార్పు చేసిన CJI సంజీవ్ ఖన్నా
అత్యవసర కేసుల విచారణ విజ్ఞప్తులపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల లిస్టింగ్‌ను నోటిమాట ద్వారా విజ్ఞప్తి చేయడాన్ని నిషేధించారు. ‘ఇకపై నోటిమాట, రాతపూర్వకంగా ప్రస్తావించడం ఉండదు. ఈమెయిల్ లేదా ప్రత్యేకమైన స్లిప్‌పై రాసి ఇవ్వాలి. అలాగే అర్జంట్‌గా విచారణ చేపట్టేందుకు కారణాలు వివరించాలి’ అని ఆదేశించారు. మాజీ CJI చంద్రచూడ్ హయాంలో కొన్ని కేసులు ఓరల్ రిక్వెస్ట్‌తో స్వీకరించారు.
News November 12, 2024
కొత్త అవతారాల్లో ముగ్గురు హీరోలు.. ఆకట్టుకుంటున్న లుక్స్
టాలీవుడ్ యువ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మనోజ్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ‘గజపతి వర్మ’ పాత్రలో నటిస్తున్నారు. రోహిత్ ‘వరద’, శ్రీనివాస్ ‘సీను’ అనే పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ‘భైరవం’ టైటిల్‌తో రాబోయే ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.