News January 19, 2025
ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముకేశ్, నీతా!

ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరూ US బయల్దేరినట్లు వార్తలొస్తున్నాయి. వర్జీనియా గోల్ఫ్ క్లబ్‌లో జరిగే ఈ మహోత్సవానికి ముందు రాత్రి ట్రంప్‌తో ‘క్యాండిల్ లైట్ డిన్నర్’లో వారు పాల్గొంటారని సమాచారం. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉషా వాన్స్‌తోనూ సమావేశమవుతారని తెలుస్తోంది.
Similar News
News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY

ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్‌ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
News February 12, 2025
ప్రధానికి బెదిరింపు కాల్

PM మోదీ టార్గెట్‌గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.