News June 2, 2024

జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య

image

ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి మున్నా అలియాస్ మహ్మద్ అలీఖాన్ జైలులో హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై ఇతర ఖైదీలతో మున్నాకు వాగ్వాదం చెలరేగింది. దీంతో కొందరు ఖైదీలు అతణ్ని రాడ్‌తో తలపై కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 1993 MAR 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మరణించారు. ఈ కేసులో దోషి మున్నా కొల్హాపూర్‌ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

Similar News

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

News September 8, 2024

నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ

image

వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News September 8, 2024

జాగ్రత్త.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు

image

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం తెలిపింది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న MHBD, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.