News April 7, 2025
ముంబై డెడ్లీ బౌలింగ్ అటాక్.. ఆర్సీబీకి సవాలే!

ఇవాళ ముంబై బౌలర్ల రూపంలో ఆర్సీబీకి సవాల్ ఎదురుకానుంది. స్వింగ్‌తో మ్యాజిక్ చేసే బౌల్ట్, దీపక్ చాహర్‌లకు తోడుగా బుమ్రా వస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒకపక్క పొదుపుగా బౌలింగ్ చేస్తూనే మరోపక్క వికెట్లు తీస్తారు. ఇక కెప్టెన్ హార్దిక్ గత మ్యాచులో 5 వికెట్లు తీసి జోరుమీద ఉన్నారు. యువ బౌలర్లు అశ్వనీకుమార్, విఘ్నేశ్‌లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Similar News
News April 11, 2025
BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.
News April 11, 2025
చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్‌ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్‌లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
కెప్టెన్సీకి ధోనీ ఏమాత్రం సంకోచించలేదు: ఫ్లెమింగ్

చెన్నై టీమ్‌కు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు ధోనీ ఏమాత్రం వెనుకంజ వేయలేదని ఆ జట్టు కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితిని ఆయనకు చెప్పగానే వెంటనే అర్థం చేసుకున్నారు. రుతు గాయపడిన నేపథ్యంలో తన స్థానంలో కెప్టెన్సీ చేయాలని కోరగానే ఏమాత్రం సంకోచించకుండా సరే అన్నారు’ అని పేర్కొన్నారు. మోచేతి గాయం కారణంగా ప్రస్తుత <<16058968>>కెప్టెన్ రుతురాజ్ సీజన్ మొత్తానికి<<>> దూరమైన సంగతి తెలిసిందే.