News November 23, 2024
రామ్ చరణ్ మూవీలో ‘మున్నా భయ్యా’?
రామ్ చరణ్ హీరోగా ‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ నటుడు దివ్యేందు శర్మ నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
Similar News
News December 8, 2024
BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
News December 8, 2024
మహాయుతి గెలుపుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది: పవార్
మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మహాయుతి’ గెలుపుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ‘మనం ఓడిన మాట నిజమే. దానిపై ఎక్కువ చింతించడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి’ అని హితబోధ చేశారు. ఎంవీఏ కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వీడటాన్ని పవార్ తోసిపుచ్చారు. ప్రతిపక్ష ఐక్యత కీలకమని అఖిలేశ్ భావిస్తున్నారని తెలిపారు.
News December 8, 2024
బోల్ట్ రికార్డ్ బద్దలుకొట్టిన గౌట్
పరుగు పందెం అనగానే మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు. ఒలింపిక్స్‌లో ఈ అథ్లెట్ నెలకొల్పిన రికార్డులు అలాంటివి మరి. తాజాగా, బోల్ట్ రికార్డును ఆస్ట్రేలియా స్ప్రింటర్ గౌట్ బద్దలుకొట్టారు. ఆస్ట్రేలియన్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200మీ. పరుగును 20.04 సె.లో పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డ్ బోల్ట్ పేరిట (20.13సె) ఉండేది. రానున్న ఒలింపిక్స్‌లో గౌట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నారు.