News August 20, 2024

రికార్డు సృష్టించిన ‘మురారి4K’

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘మురారి4K’ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్‌లో అదరగొట్టింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం $94.49K కలెక్షన్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఓ తెలుగు సినిమా రీరిలీజ్‌కి ఇంత కలెక్షన్లు రావటం ఇదే తొలిసారి అని పేర్కొన్నాయి. మీరూ రీరిలీజ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి.

Similar News

News January 13, 2026

51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కొద్వారా యూనిట్‌లో 51 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.), MBA/MCom ఉత్తీర్ణులై, వయసు 28ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష JAN 25న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, PwBDలకు ఫీజు లేదు. సైట్: bel-india.in

News January 13, 2026

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

image

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5

News January 13, 2026

బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే.. గుండెకు ముప్పే: వైద్యులు

image

రోజువారీ అల్పాహారం మానేస్తే గుండెపోటు ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతేడాది 23లక్షల మందిపై జరిపిన పరిశోధనలో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే గుండె జబ్బుల ముప్పు 17%, స్ట్రోక్ ప్రమాదం 15 శాతం పెరుగుతుందని తేలింది. ‘దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం టిఫిన్ మానేయడం కంటే, రాత్రి త్వరగా భోజనం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.