News August 20, 2024
రికార్డు సృష్టించిన ‘మురారి4K’
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘మురారి4K’ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్‌లో అదరగొట్టింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం $94.49K కలెక్షన్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఓ తెలుగు సినిమా రీరిలీజ్‌కి ఇంత కలెక్షన్లు రావటం ఇదే తొలిసారి అని పేర్కొన్నాయి. మీరూ రీరిలీజ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి.
Similar News
News September 13, 2024
నందిగం సురేశ్‌కు పోలీస్ కస్టడీ
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనను ఈనెల 5న హైదరాబాద్‌లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని, 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈనెల 15-17 వరకు 2 రోజులకే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సురేశ్ గుంటూరు జైలులో ఉన్నారు.
News September 13, 2024
రైలులో బాలికపై లైంగిక వేధింపులు.. కొట్టి చంపేసిన ప్రయాణికులు
బరౌనీ(బిహార్) నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో 11ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. చిన్నారి ఏడుస్తూ తల్లికి విషయం చెప్పగా, ఆమె మరో బోగీలోని కుటుంబీకులకు సమాచారాన్ని అందించింది. తోటి ప్రయాణికులతో కలిసి వారు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు.
News September 13, 2024
విరాట్ వచ్చేశాడు.. ప్రాక్టీస్ మొదలు
ఈమధ్య కాలంలో లండన్‌లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుల కోసం చెన్నైలో నెట్స్‌లో 45 నిమిషాల పాటు చెమటోడ్చారు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లందరూ సాధన చేశారు. ఈ నెల 19న చెన్నైలో బంగ్లాతో తొలి టెస్టు మొదలుకానుంది. నగరంలో విరాట్ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు ఆడనున్నారు. అక్కడ 4 టెస్టుల్లో ఒక సెంచరీతో 267 పరుగులు చేశారు.