News March 18, 2025
24 మంది దళితుల హత్య.. ముగ్గురికి మరణశిక్ష

UPలోని దిహులీ నరమేధం కేసులో మెయిన్‌పురి కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధించింది. 1981 నవంబర్ 18న దిహులీ గ్రామంలోని SC కాలనీలోకి చొరబడిన సాయుధ దుండగుల బృందం పురుషులు, మహిళలు, పిల్లలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 24 మంది మరణించారు. 17 మంది నిందితులపై FIR నమోదవగా, 14 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.
Similar News
News March 19, 2025
ఐమాక్స్ ఫార్మాట్లో.. మోహన్ లాల్ చిత్రం

మోహన్‌లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.
News March 19, 2025
సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.
News March 19, 2025
చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దుపెట్టిన ఫొటో వైరలవుతోంది. రేపు UK పార్లమెంట్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కు ఘనస్వాగతం లభించగా, ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. కాగా, ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ అని ఆ అభిమాని కొడుకు ట్వీట్ చేశారు.