News August 18, 2024
వైద్యురాలిపై హత్యాచారం.. నిందితునికి ‘లై డిటెక్షన్ టెస్ట్’!
కోల్‌కతాలో వైద్యురాలిపై <<13830940>>హత్యాచార<<>> కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్ట్(పాలీగ్రాఫ్) నిర్వహించేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరనున్నారు. అలాగే సైకో అనాలసిస్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ టెస్టులు చేసేందుకు CFSL నిపుణులు కోల్‌కతాకు చేరుకున్నారు. ఈ పరీక్షల వల్ల నిందితుడి మానసిక స్థితిని, అతను చెప్పే మాటల్లో అబద్ధాలను తెలుసుకోవచ్చు.
Similar News
News September 12, 2024
రేపు పిఠాపురంలో YS జగన్ పర్యటన
AP: మాజీ సీఎం YS జగన్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.
News September 12, 2024
రేవంత్.. మీ పాలన నుంచి తెలంగాణను కాపాడుకుంటాం: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో మండిపడ్డారు. ‘మీరు గూండాయిజం, దౌర్జన్యం చేసినా.. మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు. మీ అవినీతి పాలన నుంచి తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. మీరు చేసే ప్రతి బెదిరింపు మా నిర్ణయాన్ని మరింత బలంగా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బలంగా నిలబడండి. ప్రజలు, మేము మీ వెంటే ఉన్నాం’ అని పేర్కొన్నారు.
News September 12, 2024
వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏ కూరగాయలు మంచివంటే..
సీజనల్‌గా లభించేవాటిని తింటే ఆరోగ్యం బాగుంటుందంటారు పెద్దలు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయలు మంచివి? న్యూట్రీషనిస్ట్ లవ్నీత్ బాత్రా 3 కూరగాయల పేర్లు చెబుతున్నారు. అవి సొరకాయ, కాకరకాయ, మునగ. ఈ మూడింటిలోనూ పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కండరాల మరమ్మతులు, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుదల, చర్మ సౌందర్యం, ఎముకల ఆరోగ్యం విషయాల్లో ఈ మూడూ ఉత్తమమని తెలిపారు.