News August 19, 2024

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. పోస్టుమార్టంలో సంచలన విషయాలు

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గొంతు నొక్కడం వల్లే ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఒంటిపై 14 చోట్ల తీవ్ర గాయాలు కాగా గొంతు దగ్గర ఎముకలు విరిగినట్లు గుర్తించారు. కొనఊపిరితో ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో మత్తుమందు కలిపారా అనే దానిపై ఫోరెన్సిక్ నివేదిక తర్వాత స్పష్టత రానుంది.

Similar News

News September 14, 2024

నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు

image

TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

News September 14, 2024

మా నాన్న పులిని చంపి, ఆ రక్తం నా ముఖంపై పూశారు: యోగ్‌రాజ్

image

తన వద్ద కోచింగ్‌లో చేరాలంటే చావుపై భయం వదిలేయాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘మా నాన్న నన్ను చావు భయం లేకుండా పెంచారు. పులి వేటకు నన్ను తీసుకెళ్లారు. పులిని చంపి నన్ను దానిపై కూర్చోబెట్టారు. దాని రక్తం నా ముఖానికి పూశారు. పులికూన గడ్డి తినదని ఆయన అన్న మాట నేనెప్పటికీ మర్చిపోలేను. అందుకే నా కొడుకును కూడా భయంలేనివాడిలా పెంచాను’ అని పేర్కొన్నారు.

News September 14, 2024

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.