News August 23, 2024
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడు స్కూల్ టాపర్
కోల్‌కతా హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ గురించి అతడి తల్లి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. అతడు స్కూల్ టాపర్. NCC క్యాడెట్. స్పోర్ట్స్, బాక్సింగ్ అంటే ఇష్టపడేవాడు. నా కొడుకు ఇలా చేయడం వెనుక ఎవరున్నారో తెలియదు. ఎవరైనా ఉంటే వారిని కూడా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. తాను కఠినంగా ఉండుంటే ఇలా జరిగేది కాదని ఆమె వాపోయారు.
Similar News
News September 13, 2024
BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి
TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.
News September 13, 2024
కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం
TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 13, 2024
UNలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం: అమెరికా
UN భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని UNలో US అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులే లేవు’ అని అన్నారు.