News August 20, 2024
వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూర్తి
ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని జర్నలిస్టు మూర్తి పోలీసులను ఆశ్రయించారు. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు. వేణుస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఆయన స్పష్టం చేశారు. నిజాలేంటో త్వరలోనే బహిర్గతమవుతాయన్నారు.
Similar News
News January 23, 2025
Stock Markets: ఐటీ షేర్ల దూకుడు
మోస్తరు నష్టాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,156 (-2), సెన్సెక్స్ 76,448 (48) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆటో షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. విప్రో, అల్ట్రాటెక్, ట్రెంట్, M&M, టెక్M టాప్ గెయినర్స్. HUL, యాక్సిస్ బ్యాంకు, నెస్లేఇండియా, ఎస్బీఐ, BPCL టాప్ లూజర్స్.
News January 23, 2025
బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ
చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. J&Kతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆయన ముంబై తరఫున బరిలోకి దిగారు. కెప్టెన్ రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో యశస్వీతో కలిసి రోహిత్ ఓపెనింగ్‌కు వచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డ హిట్ మ్యాన్ ఈ ట్రోఫీలో ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రోహిత్ చివరిసారి 2015లో రంజీ మ్యాచ్ ఆడారు.
News January 23, 2025
వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా సీట్లు!
TG: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా అమలు చేయాలనేదానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25% సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో TGతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు.