News November 4, 2024

మ్యూజిక్ లెజెండ్ జోన్స్ మృతి

image

హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ వంటి స్టార్లతో ఆయన పనిచేశారు. 1982లో జాక్సన్‌తో థ్రిల్లర్ ఆల్బమ్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించారు. జోన్స్ 80 సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వగా 28 సార్లు గెలుపొందారు.

Similar News

News December 8, 2025

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News December 8, 2025

ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

image

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.

News December 8, 2025

‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

image

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.