News November 4, 2024
మ్యూజిక్ లెజెండ్ జోన్స్ మృతి
హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్, ఫ్రాంక్ సినాట్రా, రే చార్లెస్ వంటి స్టార్లతో ఆయన పనిచేశారు. 1982లో జాక్సన్‌తో థ్రిల్లర్ ఆల్బమ్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించారు. జోన్స్ 80 సార్లు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు నామినేట్ అవ్వగా 28 సార్లు గెలుపొందారు.
Similar News
News December 8, 2024
12న ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
News December 8, 2024
యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం
TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.
News December 8, 2024
ఐటం సాంగ్స్‌కు శ్రీలీల నో?
‘కిస్సిక్’ సాంగ్‌తో మెరిసిన శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగ్స్‌కు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతో ‘కిస్సిక్’ సాంగ్‌కు ఒప్పుకున్నట్లు సమాచారం. అటు, ఈ నెల 25న ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ విడుదల కానుంది.